Headingley Test : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్ అయింది. హెడింగ్లేలో కేఎల్ రాహుల్(137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) సెంచరీలతో కదం తొక్కగా భారీ స్కోర్ దిశగా పయనించిన టీమిండియా.. టీ సెషన్ తర్వాత అనూహ్యంగా తడబడింది. కొత్త బంతితో జోష్ టంగ్ (3-72) చెలరేగగా.. 31 పరుగుల వ్యవధిలోనే గిల్ సేనచివరి ఆరు వికెట్లు కోల్పోయింది. బషీర్ బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ బౌండరీకి యత్నించి ఔటయ్యాడు. దాంతో, ముగిసింది. ఆతిథ్య జట్టు 371 విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్(137) ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(137) ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118)లు బలమైన పునాది వేసినప్పటికీ.. టెయిలెండర్లు నిరాశపరిచారు. టీ సెషనకు ముందు పంత్ వికెట్ తీసిన బషీర్.. ఇంగ్లండ్‌కు బూస్టింగ్ ఇచ్చాడు. కొత్త బంతితో హడల్తెంచిన కార్సే, వోక్స్, జోష్ టంగ్ పోటీపడి వికెట్ల వేట కొనసాగించారు. వైస్ కెప్టెన్ పంత్‌తో కలిసి టీమిండియాను మ్యాచ్ శాసించే స్థాయికి తీసుకెళ్లిన రాహుల్ టీ సెషన్ తర్వాత కార్సే ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అదనపు బౌన్స్ కారణంగా ఎడ్జ్ తీసుకొని మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. ఆ కాసేపటికే కరుణ్ నాయర్ (20) సైతం వోక్స్ ఓవర్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 335 వద్ద ఆరో వికెట్ పడింది.
Tea Break on Day 4 at Headingley!
Superb hundreds from KL Rahul (120*) & Rishabh Pant (118) power #TeamIndia to 298/4! 💪 💪
Third Session coming 🔜!
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#ENGvIND | @klrahul | @RishabhPant17 pic.twitter.com/oHo27TlNHe
— BCCI (@BCCI) June 23, 2025
అయితే.. అప్పటికీ జడేజా, శార్థూల్ ఉండడంతో స్కోర్ 400 అవుతుందని అనిపించింది. కానీ, టంగ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లతో గట్టి దెబ్బకొట్టాడు. తొలి బంతికే ఠాకూర్ ఇచ్చిన క్యాచ్‌ను రూట్ అందుకోగా.. సిరాజ్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో పెద్ షాట్ ఆడబోయిన బుమ్రా బౌల్డయ్యాడు. అంతే..16 పరుగుల వ్యవధిలో గిల్ సేన మూడు వికెట్లు పడ్డాయి. ఇక కష్టమే అనుకున్న వేళ రవీంద్ర జడేజా(25 నాటౌట్).. టంగ్ ఓవర్లో వరుసగా 6, 4తో స్కోర్ 360 దాటించాడు. కానీ, బషీర్ ఊరించి వేసిన బంతిని ప్రసిధ్ బౌండరీకి తరలించబోయి టంగ్ చేతికి దొరికిపోయాడు. అలా భారత జట్టు 364 పరుగులకే ఆలౌటయ్యింది.