Headingley Test : హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్(137) ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (118)తో కలిసి టీమిండియాను మ్యాచ్ శాసించే స్థాయికి తీసుకెళ్లిన రాహుల్ టీ సెషన్ తర్వాత కార్సే ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. బ్యాక్‌ఫుట్‌లో రాహుల్ ఆడిన బంతి.. అదనపు బౌన్స్ కారణంగా ఎడ్జ్ తీసుకొని మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది.
ఆ కాసేపటికే కరుణ్ నాయర్ (20) సైతం వోక్స్ ఓవర్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన అతడు.. మరోసారి నిరాశపరచగా 335 వద్ద ఆరో వికెట్ పడింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(2), శార్ధూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు. గిల్ సేన ఇప్పటికీ 342 పరుగుల ఆధిక్యంలో ఉంది.
1⃣3⃣7⃣ runs
2⃣4⃣7⃣ deliveries
1⃣8⃣ foursQuality, patience, and an innings full of class from KL Rahul in Headingley 👏👏
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @klrahul pic.twitter.com/LgZF0N2vLw
— BCCI (@BCCI) June 23, 2025
లంచ్ తర్వాత పంత్(118), రాహుల్ (137) జోరుతో భారీగా పరుగులు సమర్పించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తున్నారు. కాసేపట్లో టీ అనగా.. పంత్‌ను బషీర్ పెవిలియన్ పంపాడు. నాలుగో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పంత్.. క్రాలే చేతికి చిక్కాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్(20)తోజట్టు స్కోర్ బోర్డును నడిపించాడు రాహుల్. అయితే.. టీ తర్వాత కొత్త బంతి తీసుకోవడం ఇంగ్లండ్‌కు కలిసిసొచ్చింది. రాహుల్‌ను కార్సే బౌల్డ్ చేయగా.. సీనియర్ పేసర్ స్లో బాల్‌తో కరుణ్ కథ ముగించాడు. అంతే.. చూస్తుండగానే రెండు బిగ్ వికెట్లు పడ్డాయి.