ముంబై: నీట్ ప్రాక్టీస్ టెస్ట్‌లో మార్కులు తక్కువ వచ్చినందుకు కుమార్తెపై తండ్రి ఆగ్రహించాడు. ఆమెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆ యువతి మరణించింది. (Father Beats Daughter To Death) భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల సాధన భోంస్లేకు పదో తరగతి బోర్డు పరీక్షల్లో 92.60 శాతం మార్కులు వచ్చాయి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేర్ అవుతున్నది.
కాగా, సాధనకు నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ అయిన తండ్రి ధోండిరామ్ ఆగ్రహించాడు. కుమార్తెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్రగాయమైన సాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 20న మరణించింది. ఈ నేపథ్యంలో సాధన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తండ్రి ధోండిరామ్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: వస్త్ర దుకాణం నుంచి బట్టల ప్యాక్‌లు చోరీ చేసిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?
Uzbek women | తమను గుర్తించకుండా ఉండేందుకు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఉజ్బెక్ మహిళలు
bomb explosion | ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలుడు.. బాలిక మృతి