జైనూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ప్రారంభించిన గురుకులాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన అందించారని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ( MLA Kova Lakshmi ) అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బుసిమెట్టలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో కంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన బిడ్డల చదువుకు , భద్రతకు నాటి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కంపౌండ్ వాల్ నిర్మాణం పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, ఫాక్స్ చైర్మన్ కొడప హన్ను పటేల్, జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజులాల, ఉపాధ్యక్షుడు శంకర్ కొలం, నాయకులు సతీష్ మండే,మాజీ సర్పంచ్ కొముర శ్యామ్ రావు, సర్పంచులు. ధ్రువ సింధు, బావ్బావ్ రావు, మిశ్రం నగేష్, ఉప సర్పంచులు కుండలిక్ విశ్వనాథ్ , అధికారులు పాల్గొన్నారు.