ఖిలావరంగల్, ఫిబ్రవరి 05: ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఖిలా వరంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సమ్మెట సత్యనారాయణ అన్నారు. బుధవారం కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన స్టేషనరీ అందజేసి కలిసి మాట్లాడారు.
పదిలో మంచి మార్కులు సాధించి జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం సురేందర్ రెడ్డి, జి రాములు, జి శ్రీనివాస్, సిహెచ్ రాజు, కే ప్రసాద్, డి శుక్లాంబరం, రజిత, స్కూల్ హెచ్ఎం శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.