సారపాక సుందరయ్యనగర్‌లో ప్రజా సంఘాల నిరసన
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఓటుపై వేటు నిరసనపై నిషేధం ఎత్తి వేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్‌లో శుక్రవారం ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
– సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
బూర్గంపహాడ్, అక్టోబర్ 23 : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఓటుపై వేటు నిరసనపై నిషేధం ఎత్తి వేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక సుందరయ్యనగర్‌లో శుక్రవారం ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉన్న ఓటు హక్కును తొలగించాలనే ఆలోచనతో జ్ఞానేష్‌కుమార్‌ను పావులా ఉపయోగించుకుందని, దీనివల్ల దేశంలో 13 కోట్ల ఓట్లు రద్దయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు పాపినేని సరోజిని, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు కనకం వెంకటేష్, బత్తుల గోపాలరావు, అప్పారావు, జాన్మియా, నిమ్మల పద్మ, బెల్లంకొండ పద్మ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

