Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Delhi Protests : సీఈసీకి, సర్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కొందరు ఆందోళనకారులు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అయితే, వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
Delhi Protests : సీఈసీకి, సర్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. కొందరు ఆందోళనకారులు శుక్రవారం సర్‌కు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సర్ పేరుతో ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. అయితే, వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం జరిగిన ఆందోళనలో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే సహా పలువురు నేతల్ని ఆహ్వానించారు. పలువురు రైతులు, విద్యార్థులు, పౌర సంఘాల ఆధ్వర్యంలో.. ఢిల్లీలోని సాహిబ్ గురుద్వారా బంగ్లా నుంచి పటేల్ చౌక్ సమీపంలోని ఈసీఐ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని భావించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా.. అలాగే, ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు.. హర్ గలి జంతర్ మంతర్.. హర్ గావో జంతర్ మంతర్.. మేరా ఘర్ జంతర్ మంతర్ అంటూ నినదించారు.
అయితే, ఆందోళనకారుల్ని ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఆందోళనల్ని అదుపు చేసేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసులు, ఇతర భద్రతా బలగాల్ని మోహరించిన కేంద్రం.. ఇప్పుడు అదనంగా 273 సీఏపీఎఫ్ కంపెనీలను రంగంలోకి దించింది. అక్టోబర్ 31 వరకు వీరు ఢిల్లీలో సేవలందిస్తారు. ఈ నెల ప్రారంభం నుంచి వీరు ఇక్కడ పని చేస్తున్నారు. ముందుగా అక్టోబర్ 20 వరకే సీఏపీఎఫ్ బలగాల్ని ఉంచాలని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా అక్టోబర్ 30 వరకు ఈ బలగాల్ని మోహరించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

