‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
సమాజ దురాగతాలపై కలం ఎక్కుపెట్టి, తన జీవితాన్ని రంగస్థలంకే అంకితం చేసిన కె.ఎల్ నరసింహారావు కృషిని ఉప వాచకాలుగా పాఠ్య ప్రణాళికల్లో చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి జూలూరు గౌరీ శంకర్ కోరారు. సామాజిక వికాసం కోసం సాంస్కృతిక సైనికుడిగా జీవితకాలం కృషి చేసిన కె.ఎల్ కృషిని, ఆయన రచనలను...
– ఆయన జీవితాన్ని ఉప వాచకాలుగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
– తెలంగాణ తొలి మాండలిక రచయిత కేఎల్ 102వ జయంతి సభలో జూలూరు గౌరీ శంకర్
కోదాడ, అక్టోబర్ 23 : సమాజ దురాగతాలపై కలం ఎక్కుపెట్టి, తన జీవితాన్ని రంగస్థలంకే అంకితం చేసిన కె.ఎల్ నరసింహారావు కృషిని ఉప వాచకాలుగా పాఠ్య ప్రణాళికల్లో చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి జూలూరు గౌరీ శంకర్ కోరారు. సామాజిక వికాసం కోసం సాంస్కృతిక సైనికుడిగా జీవితకాలం కృషి చేసిన కె.ఎల్ కృషిని, ఆయన రచనలను నేటి తరానికి తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీర తెలంగాణ పోరు ఘట్టాలను గాంధీయ మార్గంలో నాటకాలుగా రచించి వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సాంస్కృతిక యోధుడు, తెలంగాణ మాండలిక తొలి రచయిత కె.ఎల్ అని పేర్కొన్నారు. కె.ఎల్ 102వ జయంతి సందర్భంగా ఆయన సొంత ఊరు మునగాల మండలం రేపాల గ్రామంలో శుక్రవారం ఉదయం కేఎల్ విగ్రహం వద్ద వేముల వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వెలువరించిన “నాటక రంగ శిఖరం కె.ఎల్ నరసింహారావు” పుస్తకాన్ని జూలూరు గౌరీ శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్ళ ముందు జరుగుతున్న దురాగతాలను ప్రజలకు తెలియజేస్తూ రచనలు చేయడమే సాహిత్యకారులు చేయవలసిన పని అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని కళ్లారా చూసిన కె.ఎల్ నరసింహారావు “విప్లవ శంఖం” “గెలుపు నీదే” నాటకాలను రాశారని గుర్తు చేశారు. 100కు పైగా నాటకాలు రాసి వేలాది ప్రదర్శనలు ఇచ్చిన రంగస్థలం చరిత్ర కె.ఎల్ అన్నారు. వీరతెలంగాణ పోరాటం ఎగుస్తున్న వేళ అనేక రచనలు చేసి నాటక రంగ జెండాను ఎత్తి పెట్టారన్నారు. తను పుట్టిన ఊరుని రంగస్థలం వేదికగా మార్చి “గ్రామ వెలుగు నాట్య కళామండలి” పేరుతో ఒక సంవత్సర కాలం నిరాఘాటంగా ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ రికార్డును మించిన చరిత్రను సృష్టించారని పేర్కొన్నారు. ఆయన నాటక ప్రదర్శనలు చూసేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రేపాల గ్రామం మట్టిపై కూర్చుని తిలకించారనీ తెలియజేశారు.
కండ్ల ముందు జరుగుతున్న దురాగతాలపై నిరంతరం ప్రజల దృక్పథం నుంచి రచనలు రావలసిన అవసరం ఉందన్నారు. మునగాల పరగణ సాయుధ పోరాటానికి శిక్షణ కేంద్రం అయితే, నడిగూడెం గ్రంథాలయ ఉద్యమాన్ని, రేపాల నాటక రంగ జెండాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషిచేసిన సాహిత్య సంస్కృతిక కేంద్రాలని సింహావలోకనం చేశారు. తెలంగాణ నాటక రంగ చరిత్రలో కె.ఎల్ ది చెరిగిపోని అధ్యాయమని జూలూరు విశ్లేషించారు. సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ… గ్రామాలను చైతన్యం చేయడం కోసం, సమాజ చైతన్యం కోసం నిరంతరం రచనలు చేసి ప్రజల నాలుకలపై సజీవంగా కె.ఎల్ ఉన్నారని అన్నారు. రేపాల లాంటి గ్రామానికి అనేకమంది కళాకారులను పరిచయం చేసిన రంగస్థల దిగ్గజం అని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత మొగిలిచర్ల సత్యనారాయణ వహించగా రేపాకుల గురవయ్య, పందిరి పుల్లారెడ్డి, సుంకర అజయ్ కుమార్, యుగంధర్ రెడ్డి, గెల్లి రంగారావు, కోదాటి వెంకటరమణ, వెంపటి పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

