‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపుమేరకు...
– ఓటరు నమోదుపై కళాశాలలు, గురుకులాలు, పాఠశాలల్లో పట్టభద్రులకు బీఆర్ఎస్ నేతల అవగాహన
బూర్గంపహాడ్, అక్టోబర్ 23 : అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపుమేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మైనార్టీ, గురుకుల కళాశాల, కస్తూర్భాగాంధీ పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను కలిసి ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి ఓటు విలువను చాటిచెప్పారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును ఆన్లైన్లో ఓటరు నమోదు చేపట్టి అర్హత పొందాలని, ఓటు హక్కు కోల్పోకుండా ఆ ఓటును సరైన అభ్యర్ధికి వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం పట్టభద్రుల బాధ్యత అన్నారు.
పట్టభద్రులు ఓటును ఎలా నమోదు చేసుకోవాలి, ఏఏ డాక్యుమెంట్లు సమర్పించాలి, ఆన్లైన్ విధానంలో ఎలా నమోదు చేసుకోవాలో క్లుప్తంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, బిజ్జం వెంకట్రామిరెడ్డి, మాజీ మండల యూత్ అధ్యక్షుడు గోనెల నాని, మైనార్టీ మాజీ మండల అధ్యక్షుడు సాధిక్ పాషా, చట్టు ఆంజనేయులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

