Ramayana | ‘ఛావా’ రికార్డు బద్దలు.. కేవలం 9 రోజుల్లో రూ. 1100 కోట్ల క్లబ్లో ‘రామాయణం’!
Ramayana | దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలతో దూసుకుపోతోంది.
Ramayana | దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలతో దూసుకుపోతోంది. విడుదలైన కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ భారీ బడ్జెట్ చిత్రం విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా లైఫ్‌టైమ్ ఇండియా నెట్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. తొమ్మిదో రోజు దేశవ్యాప్తంగా రూ. 47.85 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టడంతో, భారతదేశంలో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 612.45 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ. 1,100 కోట్లను దాటాయి.
ప్రస్తుతం ఈ సినిమా భారతదేశపు గ్రాస్ కలెక్షన్లు రూ. 732.20 కోట్లకు, ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్లు రూ. 378.50 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1,110.70 కోట్లకు చేరాయి. ఈ చిత్రం ఇంతకు ముందే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (రూ. 544.28 కోట్లు), రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ (రూ. 556.36 కోట్లు) సినిమాల లైఫ్‌టైమ్ వసూళ్ల రికార్డులను కూడా వెనక్కి నెట్టింది.
వాల్మీకి మహర్షి రామాయణం ఆధారంగా రెండు భాగాలుగా ఈ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతాదేవిని రక్షించడానికి రాముడు సాగించిన ప్రయాణమే ఈ మొదటి భాగం యొక్క ప్రధాన కథాంశం. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజి మరియు యశ్ ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ సినిమా రెండవ భాగం 2028 దీపావళికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘ఛావా’ రికార్డు బద్దలు.. కేవలం 9 రోజుల్లో రూ. 1100 కోట్ల క్లబ్లో ‘రామాయణం’!
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది..?
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

