హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పోస్టుల భర్తీలో ప్రభుత్వం రాజీ పడుతోందని ఆరోపిస్తూహైదరాబాద్కు చెందిన కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారించింది.
డీఎస్సీ-2024 నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లో స్పోర్ట్ అథారిటీని ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. 96 ఎస్జీటీ పోస్టుల నియామకంలో అవకతవకలు జరిగాయంటూ కొత్తగూడెం జిల్లాకు చెందిన టీ జోత్స్న దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీ కార్తీక్ విచారణ చేపట్టారు.
ఎంబీబీఎస్ , బీడీఎస్ సీట్ల భర్తీ కోసం జారీ అయిన జీవో 33, జీవో 150లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
సైనిక్ సూల్ విద్యార్థికి ఊరట తెలంగాణకు చెందిన తనకు స్థానిక కోటాలో సీటు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ‘నీట్’ అభ్యర్థి శశికిరణ్కు కోర్టులో ఊరట లభించింది.