కాంగ్రెస్ ధాన్యం స్కామ్ గుట్టు రట్టు.. పెద్ది సుదర్శన్‌రెడ్డి
కాంగ్రెస్ సర్కారు చేసిన తొలి కుంభకోణం గుట్టు రట్టయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సైప్లె డిపార్టుమెంట్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్‌ను దోషిగా నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు.
- ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం
- కాంగ్రెస్ పెద్దలు తిన్న సొమ్ము కక్కే దాకా పోరాటం ఆగదు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు చేసిన తొలి కుంభకోణం గుట్టు రట్టయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సైప్లె డిపార్టుమెంట్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్‌ను దోషిగా నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. గత 20 నెలలుగా సివిల్ సైప్లె శాఖలో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ సాగించిన పోరాటం ఫలించిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022-23లో గత సర్కారు హయాంలో కొనుగోలు చేసి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కారులోని పెద్దలే బినామీలుగా ఉండి రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అందుకు సంబంధించిన ఆధారాలు సహా కోర్టులో పిల్ వేసిందని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 20 నెలల క్రితమే కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం కౌంటర్ వేయకుండా 18 సార్లు వాయిదా కోరిందని పేర్కొన్నారు. దీనినిబట్టే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఆధారాలు సేకరించిందనే విషయం స్పష్టమవుతున్నదని తెలిపారు. కేంద్ర దర్యాపు సంస్థలైన ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్, రాష్ట్ర సంబంధిత విచారణ సంస్థలైన ఏసీబీ, రాష్ట్ర విజిలెన్స్ సంస్థలకు 755 పేజీల రాతపూర్వకమైన వివరాలతో కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంలో బీఆర్ఎస్ పాక్షిక విజయం సాధించినట్టయిందని, కాంగ్రెస్ పెద్దలు అక్రమంగా తిన్న ప్రజల సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

