మియాపూర్:కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా ఓ వైపు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజల సౌకర్యం కోసం సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సంపూర్ణ తోడ్పాటుతో అభివృద్ధిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా చూసుకుంటున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో రూ. 1,01,70,000లతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనులను చేపడుతున్నామని, రహదారులు, తాగునీరు, విద్యుత్, డైనేజీ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ముంపు సమస్యల్లేకుండా వరద నీటి కాలువలు, మురుగు సమస్యల్లేకుండా డైనేజీ వ్యవస్థ, దుర్వాసనలు రాకుండా ఎస్టీపీలు సహా మరెన్నో అభివృద్ధి పనులను సమానంగా చేపడుతున్నామని విప్ గాంధీ తెలిపారు.
అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కార్పొరేటర్లు, అధికారులతో కలసి ఆస్బెస్టాస్ కాలనీలో పాదయాత్ర చేపట్టారు. కాలనీలో డైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను స్థానికులు విప్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి కాలనీని అభివృద్ధి పరుస్తానని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఈఈ గోవర్థన్, ఏఈ శివప్రకాశ్,పార్టీ నేతలు సంజీవరెడ్డి, జిల్లా గణేశ్,నాగేశ్వర్రావు, ప్రసాద్, ఖయ్యూమ్, కాశీనాథ్, మోహన్, హర్షద్య,రఫిక, జ్యోతి, రాధాబాయి, కాలనీ వాసులు పాల్గొన్నారు.