– దాస రమేష్, చిలుకూరు
మీది తూర్పు ఇల్లు అయినప్పుడు ఇంటివెనుక భాగంలో పడమరలో వేయవచ్చు. కానీ, పడమర సింహద్వారం ఇల్లు అయితే.. దక్షిణం వైపు ఇంటికి మధ్యలో గదుల నిర్మాణం చేయాలి. అయితే అటువైపు ఖాళీ ఉండాలి. ఆ గదులు ఇంటిని, కాంపౌండ్‌ను అంటకుండా వేసుకోవాలి. ప్రధానంగా ఉపగదులు మన ముఖద్వార ప్రాంతాన్ని ఆటంక పరచకుండా ఒకవైపు ఒదిగి ఉండటం వల్ల.. ఇంటి ఆరుబయట ప్రశాంతత నెలకొంటుంది. అందుకే స్టాఫ్ గదులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
వాళ్లకు కూడా ప్రైవసీ ఉండేలా చూడాలి. నైరుతి, ఈశాన్యం కాకుండా దక్షిణం, పశ్చిమం, ఉత్తర-వాయవ్యం, తూర్పువైపు ఆగ్నేయం దిశలు ఉపగదులకు ఉచితమైన స్థానాలు. వాటి ఫ్లోరింగ్ మన ఇంటి లెవల్ కన్నా తక్కువ ఎత్తు ఉండేలా.. ఇంటి ఎత్తు కన్నా వాటి కప్పు కిందకు ఉండేలా నిర్మించాలి. ఉపగదులను
ఉపగదుల్లా నిర్మించినప్పుడే.. అందరికీ మంచిది.
– ఎస్.శ్రీలత, ఉప్పల్
ఏ నిర్మాణంలోనైనా నైరుతి స్థానం యజమానిదే! అది శక్తిస్థానం. వ్యాపారం చేసినా, గృహమైనా దానిని నడిపించే నాథుడు ఉన్నాడు కాబట్టి, ఆ స్థానం అతనికే ఏర్పాటు చేయాలి. చాలామంది బరువు ఉండాలని నైరుతిలో పెద్ద గద్దెను పెడతారు. బరువు అనేది భౌతికమైన అర్థంలో తీసుకోవద్దు. అది ఒక శాంతిస్థానం. రెండు ప్రధాన దిశలు కలిసే కీలక స్థానమది.

అందుకే దాన్ని వస్తువులతో నింపితే ఉపయోగం ఉండదు. డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్‌ను అటు ఇటు కదలనివ్వకుండా ఒక కర్రను కడితే.. అది నేరుగానే పోతుంది. కానీ, గొయ్యి ఉన్నచోట మలుపు తిరగదు, మనిషిని చూసి ఆగదు కదా! అందుకే కీలకమైన ఇంటిస్థానంలో ఎవరు ఉండాలో.. వాళ్లే ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. మీరు ఒక గోడౌన్ కట్టినట్లయితే, దానికి స్థాన నిబంధన ఉండదు. ఎలాగైనా వాడుకోవచ్చు.
– ఏనుగుల రామచందర్, ఖాజీపేట
విద్యుత్తు తీగలు ఇంట్లోని అన్ని గోడలకు ఉంటేనే కదా ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు పనిచేసేది. ప్రతి విషయానికీ అనుమానపడొద్దు. నీరు పైకి వెళ్లడం అవసరం. దానికి టెక్నికల్‌గా ఎలా వీలుంటే అలానే నీటిపైపులు జతచేసి.. పైన ఉన్న ట్యాంకులోనికి పంపించండి.

సాధారణంగా నీళ్లసంపు ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. దానిలో నుంచి నీళ్లు పైకి వెళ్లడానికి ఉత్తరం గోడను అనుసరించే పైకి తీసుకొని.. పడమర గోడను తాకుతూ నీళ్ల ట్యాంకును చేరుతాయి. ఇదంతా ప్లంబర్ చక్కగా చేసుకుంటాడు. దానికి ఎలాంటి శాస్త్ర నియమం లేదు. దక్షిణ నైరుతి నుంచి గానీ పశ్చిమం నుంచి గానీ నీళ్ల పైపులు వెళ్లవచ్చు. కేవలం ఉత్తరం నుండి ఈశాన్యం వైపు నుంచి మాత్రమే నీరు వెళ్లాలనే రూలేమీ లేదు.
– కుందారం శంకర్, జనగాం
పారు అంటే వరుస, హద్దు అని అర్థం. మన ఇల్లు కట్టాలంటే తప్పక కాంపౌండ్లు ఉండాలి. కాబట్టి మన ఇరుపక్కల ఇండ్ల ప్రహరీ పారు చూడాల్సిన పనిలేదు. వాళ్లకు కాంపౌండ్లు లేకుండా ఇల్లు మాత్రమే ఉంటే.. ఆ ఇంటి హద్దునే తీసుకోవాలి. మన నిర్మాణం రోడ్డులోనికి చొచ్చుకుపోకుండా.. ఒకే వరుసను కలిగి ఉండటానికి పారును పాటిస్తారు.

తద్వారా మన ఇంటికి పక్కలవైపు వీధిశూలలు రాకుండా ఉంటాయి. ఇల్లు ఒక విధానంలో ఒదిగి ఉండటం అన్నివిధాలా రక్షిస్తుంది. పక్కింటికి ప్రహరీ లేకున్నా మీరు కట్టే ఇంటికి ప్రహరీలు కట్టుకోండి. మీ కాంపౌండ్‌ను ముందుగా పారు చేసుకొని దాని లోపల మీ ఇంటికి సరైన ప్రదక్షిణ స్థలం వదిలిపెట్టుకోండి. వీధులు సమంగా సరళరేఖలా సాగి పోవడం అనేది అందరికీ మంచిది. ఇండ్లు వెనక్కు, ముందుకు ఉండకుండా పారు పద్ధతి అందరం పాటించాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143