కొల్లాపూర్, సెప్టెంబర్ 27 : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా మొదలు సింగోటం వరకు బీఆర్ఎస్ శ్రేణులు బారులు తీరారు. సింగోటంలోని బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ చేరుకోగానే వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ అభిమానులు కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.
బీఆర్ఎస్ శ్రేణుల నినాదాల మధ్య బీరం లక్ష్మారెడ్డి చిత్ర పటానికి నివాళి అర్పించిన కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, దాసోజు శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, గద్వాల బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు ఉన్నారు.