అమ్మ స్థానాన్ని మించిన స్థానం ఈ జగత్తులో మరొకటి ఉండదు. ఓ స్త్రీ వృత్తి పరంగా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. వ్యక్తిగతంగా అమ్మ స్థానానికి ఇచ్చేదే అసలైన విలువ. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ ఫన్నీ వీడియో ఈ విషయాన్నే వ్యక్తపరుస్తున్నది. 40ఏండ్ల వయసులో మాతృత్వంలోకి అడుగుపెట్టిన తర్వాత బిడ్డ పెంపకంలో పడిపోయి, చిన్న చిన్న విషయాలను కూడా అమ్మ ఎలా మరిచిపోతుందో ఈ వీడియోలో సహజంగా చూపించారు.
రోజువారీ పనులు చేస్తూనే, వస్తువులు ఎక్కడ పెట్టామో హటాత్తుగా మర్చిపోవడం వంటి ‘మామ్ బ్రెయిన్’ ఘట్టాలతో భావోద్వేగ పూరితంగా, వినోదాత్మకంగా ఈ వీడియా సాగింది. పిల్లల పెంపకంలో నిమగ్నమైన తల్లి మానసిక పరిస్థితిని అద్దం పడుతున్న ఈ వీడియో.. ప్రియాంక షేర్ చేసిన క్షణాల్లో వైరల్ కావడం విశేషం. ముఖ్యంగా తల్లులు ఈ వీడియోపై కామెట్ల వర్షం కురిపిస్తున్నారు. 2022లో సరోగసీ ద్వారా మాల్టీ మేరీకి ప్రియాంక జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా బిజీగా ఉన్నప్పటికీ, బిడ్డను మాత్రం వెంటతీసుకునే వెళ్తుంటారు ప్రియాంక. ఈ విషయంలో
చాలామంది తల్లులకు తను ఆదర్శంగా నిలుస్తున్నారు.