వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘సరస్వతి’ చిత్రం మార్చి 6న విడుదలకానుంది. శనివారం ట్రైలర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని ఆవిష్కరించారు. తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రమిదని, ఈ కథ విని తాను షాక్ అయ్యానని, వరలక్ష్మి శరత్‌కుమార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిందని గోపీచంద్ మలినేని అన్నారు.
నటిగా తనకు దర్శకుడు గోపీచంద్ మలినేని సెకండ్‌లైఫ్ ఇచ్చారని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఫీమేల్ కంటెంట్‌తో ఆద్యంతం థ్రిల్ పంచే చిత్రమిదని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పారు. ఫస్ట్‌టైమ్ డైరెక్షన్ చేసిన తన సోదరి ఎంతో క్లారిటీతో సినిమా తీసిందని నిర్మాత పూజా శరత్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కథ: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పూజా శరత్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకత్వం: వరలక్ష్మి శరత్‌కుమార్.