సంగారెడ్డి : డంపింగ్ యార్డు (Dumping yard)ఏర్పాటుకు వ్యతిరేకంగా మూడో రోజు నిరసనలు కొనసాగు తున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మూడో రోజు విద్యార్థులు సైతం డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకత అంటూ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ నిన్న నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గురువారం గ్రామస్తులు సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటును విరమించే వరకు సెల్ టవర్ దిగమంటూ హెచ్చరించారు. అలాగే డంప్ యార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఉదయం నుంచి నిరవధికంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గుమ్మడిదల మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు.