జగిత్యాల, సెప్టెంబర్ 15: చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బాలతో ఆందోళన చేశారు. గమనించిన పోలీస్ సిబ్బంది వారి నుంచి పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
టౌన్ సీఐ కరుణాకర్ వచ్చి ఆందోళన విరమింపజేశారు. గంగపుత్రులు కలెక్టర్కు వినతిపత్రం అందజేసి తమ గోడు వెల్లబోసుకున్నారు.