హైదరాబాద్ : వాళ్లిద్దరు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరేళ్ల ప్రేమలో ఉన్న వారు కులాంతర వివాహం చేసుకొని పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇది నచ్చని వధువు తల్లిదండ్రులు కూతురిని నమ్మించి కిడ్నాప్‌కు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్‌తో పెద్దపెల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కాగా, కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత ప్రియాంకకు ఆమె తల్లి ఫోన్ చేసి మాట్లాడి కలిసిపోయినట్లు నటించారు. జరిగింది ఏదో జరిగిపోయిందని సొంతి ఊరికి రమ్మని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి వెళ్లగా మార్గమధ్యంలో ప్రియాంకను ఆమె తల్లిదండ్రులు, బావ కిడ్నాప్ చేయడానికి యత్నించారు. ఎలాగోలా స్థానికుల సహాయంతో తప్పించుకున్న ప్రియాకం తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
కులాంతర వివాహం చేసుకున్న కూతురిని కిడ్నాప్ చేయాలని చూసిన తల్లిదండ్రులు
తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్ తో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పెద్దపెల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక
కులాంతర వివాహానికి… pic.twitter.com/f2npQAkGnM
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025