Aitharajupalli | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 5: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్, ఆలయ అర్చకులు నాగేంద్ర చార్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.