న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. సమావేశంలో ప్రధాని మోదీ భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యను కొనియాడారు. ఇది మనమందరం గర్వించదగ్గ క్షణం అని పేర్కొన్నారు. భద్రతా దళాలు ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేయటం, ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడంపై కేంద్ర క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. దీనికంటే ముందు, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతిని కేంద్ర క్యాబినెట్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు.