అమరావతి : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వారు వెల్లడించారు.