Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
Soil Fertility | సాగు భూముల సారవంతాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలనే లక్ష్యంతో ఖేత్ బచావో అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ తెలిపారు.
మాగనూరు : సాగు భూముల సారవంతాన్ని ( Soil Fertility ) కాపాడుతూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలనే లక్ష్యంతో ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan) ను నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ( AO Sudarsan Goud ) తెలిపారు. నేరడగం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో భూసార పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూముల సారవంతాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని అన్నారు. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కోవచ్చని సూచించారు. నేలలో సేంద్రియ కర్బనం పెరగడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి, పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
వరి కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకర మైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు, నేలలోని పోషకాలు తగ్గి పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం లేదా కంపోస్టుగా తయారు చేసి వినియోగించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు పంటల మార్పిడిని పాటించాలని, వరి తర్వాత శనగ, పెసర, మినుము వంటి పప్పుధాన్యాల పంటలను సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

