Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Robin Uthappa: మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. వచ్చే సీజన్ నుంచి ఊతప్ప.. ముంబై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇక బౌలింగ్ కోచ్‌గా మిచెల్ మెక్క్లెనాగన్ను తీసుకున్నారు.
ముంబై: టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa).. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. వచ్చే సీజన్ నుంచి ఊతప్ప.. ముంబై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇక బౌలింగ్ కోచ్‌గా మిచెల్ మెక్క్లెనాగన్ను తీసుకున్నారు. టీ దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ డెవలప్మెంట్ కోచ్‌గా ధావల్ కులకర్ణిని నియమించారు. ఇటీవలే ఆ జట్టు ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్‌ను నియమించిన విషయం తెలిసిందే.
Mumbai Indians today announced the appointment of Robin Uthappa as Batting Coach, Mitchell McClenaghan as Bowling Coach, T. Dilip as Fielding Coach and Dhawal Kulkarni as Development Bowling Coach for the upcoming IPL 2027 season.
They will join Head Coach Kieron Pollard as part of a new-look coaching group that brings together a strong understanding of the Mumbai Indians culture, extensive international experience and a shared commitment to developing talent and delivering success.
https://t.co/cA7yI5Khpk
— Mumbai Indians (@mipaltan) October 30, 2026
గతంలో ఊతప్ప, మెక్‌క్లెనాగన్ ముంబై తరపున ఆడారు. కివీస్ బౌలర్ అయిన మెక్‌క్లెనాగన్ ముంబై తరపున 56 మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2019 టైటిల్స్ గెలిచిన ముంబై బృందంలో అతను ఉన్నాడు. ముంబై తరపున ఆడిన ఒకే సీజన్లో ఊతప్ప 14 మ్యాచుల్లో 320 రన్స్ చేశాడు. కోల్‌కతా, చెన్నై జట్ల తరపున కూడా ఊతప్ప ఆడాడు. అతను మొత్తం 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో 4952 రన్స్ స్కోరు చేశాడు.
Robbie talks about a new role at a familiar place, the clarity he wants to give to youngsters, and making MI a force outside of Wankhede too! 👊
Watch to hear from our new Men’s Batting Coach! 😁 https://t.co/mrFysRgF1r
— Mumbai Indians (@mipaltan) October 30, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

