Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
Soil Fertility | సాగు భూముల సారవంతాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలనే లక్ష్యంతో ఖేత్ బచావో అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ తెలిపారు.
మాగనూరు : సాగు భూముల సారవంతాన్ని ( Soil Fertility ) కాపాడుతూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలనే లక్ష్యంతో ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan) ను నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ( AO Sudarsan Goud ) తెలిపారు. నేరడగం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో భూసార పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూముల సారవంతాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని అన్నారు. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కోవచ్చని సూచించారు. నేలలో సేంద్రియ కర్బనం పెరగడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి, పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
వరి కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకర మైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు, నేలలోని పోషకాలు తగ్గి పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం లేదా కంపోస్టుగా తయారు చేసి వినియోగించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు పంటల మార్పిడిని పాటించాలని, వరి తర్వాత శనగ, పెసర, మినుము వంటి పప్పుధాన్యాల పంటలను సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

