భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ శాఖల అనుమతులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
– పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా డీఆర్ఓ పద్మావతి నియామకం
భద్రాద్రి కొత్తగూడెం. అక్టోబర్ 30 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ శాఖల అనుమతులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు ప్రత్యేక అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతిని నియమిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రతిపాదనలు, అనుమతులను సంబంధిత శాఖల నుంచి త్వరితగతిన పొందాలని ఆదేశించారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చేపట్టిన పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధులు, అనుమతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పుష్కరాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భద్రాచలంలోని పుష్కర ఘాట్ల అభివృద్ధి, విస్తరణతో పాటు భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్షించారు. పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్నానపు ప్రదేశాలు, రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి సదుపాయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రామాలయం నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న 47 ఇళ్ల తొలగింపునకు సంబంధించిన అంశాన్ని సమీక్షిస్తూ, ఆయా నిర్మాణాల వివరాలు, విలువ అంచనాలు, నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్)పై చర్చించారు. బాధితులకు నిబంధనల ప్రకారం పునరావాసం, పరిహారం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
భద్రాచలం బ్రిడ్జి నుండి పుష్కర ఘాట్ లకు రహదారి విస్తరణకు అవసరమైన భూమి, నిర్మాణాలు, భూసేకరణ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కర ఘాట్‌కు అనుసంధానంగా నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులు, యాత్రికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. భద్రాచలంలో వీఐపీ, వీవీఐపీ అతిథి గృహాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అన్ని వసతులతో ఆరు సూట్లతో కూడిన అతిథి గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి, సంబంధిత శాఖల అనుమతులతో ప్రతిపాదనలను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
సమన్వయంతో గడువులోగా పనులు పూర్తి
గోదావరి పుష్కరాల నాటికి ఆలయం, ఘాట్లు, పట్టణ పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా శాఖల వారీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అధికారులకు అప్పగించిన బాధ్యతలు, పనుల పురోగతికి సంబంధించిన మినిట్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని, తదుపరి సమీక్షలో వాటి ఆధారంగా పురోగతిని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, భద్రాచలం దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు, భద్రాచలం తహసీల్దార్ రామ్ కుమార్, దుమ్ముగూడెం తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

