Drinking water | బోనకల్, ఫిబ్రవరి 22 : గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఈజీఎస్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, ఈజిఎస్ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రాగునీటి ఎద్దడి రాకుండా వేసవిలో అన్ని జీపీలలో ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. స్వచ్చమైన త్రాగు నీరు సరఫరా చేయటానికి ప్రతి రోజూ క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలకు అందించాలన్నారు.
ఎంపీడీవో రావత్ రమాదేవి మాట్లాడుతూ.. నర్సరీల నిర్వహణ, ఈజీఎస్ పనుల నిర్వహణకు జాగ్రత్తలు పాటించా లన్నారు. కూలీలకు వడ దెబ్బ తగలకుండా తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమీక్షలో ఎంపీవో వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏపీవో కృష్ణకుమారి, భగీరథ ఏఈఈలు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి