హైదరాబాద్: ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించగా, కౌన్సిల్లో చైర్మన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17ను (September 17) ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.