వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంకకు బదిలీపై వచ్చిన తహసీల్దార్ జోగినిపల్లి అనుపమ రావు ( Anupama Rao ) ను బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భూసమస్యలపై భూభారతీ (Bhu Bharati) లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తూ రైతులపట్ల సానుకుల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ బావు రాయమల్లు, నాయకులు ఎండీ సలీం, పొన్నాల లక్ష్మణ్, బావు నాగయ్య తదితరులు ఉన్నారు.