బహదూర్‌గూడలో 650 ఎకరాల కోసం పోలీస్ ఆపరేషన్.. రైతుల దీక్ష భగ్నం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమి కోసం పోలీస్ ఆపరేషన్ మొదలైంది. తమ పట్టా భూములను రక్షించుకునేందుకు గత పది రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారు
శంషాబాద్ రూరల్, జూలై 18: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమి కోసం పోలీస్ ఆపరేషన్ మొదలైంది. తమ పట్టా భూములను రక్షించుకునేందుకు గత పది రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారు. శనివారం తెల్లవారుజాము నుంచి 1200 మంది పోలీసుల వలయంలో బహదూర్‌గూడ గ్రామం ఉండిపోయింది.
బహదూర్‌గూడలోని 650 ఎకరాలను ప్రభుత్వ భూములుగా చూపించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నింది. దీనిపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే తమ భూముల కోసం శాంతియుతంగా ధర్నా చేపట్టిన శిబిరాల వద్దకు శనివారం తెల్లవారుజామున వేలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వారిని నిర్బంధించారు.
రైతులను నిర్బంధించి 650 ఎకరాల భూమి చుట్టూ రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రైతు కుమ్మరి నరసింహ కింద పడిపోయారు. దీంతో అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ మాట్లాడుతూ.. బహదూర్‌గూడ గ్రామంలోని 650 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికి చెందినవని, ఆ భూములను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో 650 ఎకరాల కోసం మొదలైన పోలీస్ ఆపరేషన్
శాంతియుతంగా పట్టాల కోసం నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను అదుపులోకి తీసుకుని నిర్బంధిస్తున్న పోలీసులు
తెల్లవారుజాము నుండి 1,200 మంది పోలీసుల వలయంలో బహదూర్‌గూడ గ్రామం
కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు… https://t.co/bfz3nyLWi6 pic.twitter.com/9lBDSQ0fzY
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

