Korutla | కోరుట్ల, మే 10: పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్లో, పూజ స్వీట్ హౌజ్ సమీపంలో తనిఖీలు చేపట్టారు.
ప్రయాణీకుల లగేజీతో పాటూ బాటసారుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సాధారణ తనిఖీల్లో భాగంగా ముందస్తూ జాగ్రత్త కోసం తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.