నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులు గవ్వల బండారును అమ్మవారిపై చల్లుతూ చల్లంగా దీవించమ్మా అంటూ వేడుకొన్నారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు సుమారు లక్షకుపైగా వచ్చినట్టు అంచనా. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
– కోస్గి