బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా | ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఘటనపై యూపీ సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని బారాబంకి డీఎంను ఆదేశించారు. మిగతా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించినట్లు యూపీ అదనపు హోంశాఖ కార్యదర్శి తెలిపారు. బారాబంకీ మృతులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్నో – అయోధ్య రహదారిపై హర్యానా నుంచి బిహార్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సును రామ్ స్నేహి ఘాట్ సమీపంలో ట్రక్టు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారని లక్నో జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ్ సబత్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. బస్సుకు డ్రైవర్ మరమ్మతులు చేస్తుండగా.. ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలోనే లక్నో వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టిందని ఏడీజీ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
Vaccine for children : కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు
Corona Reinfection : ముంబై వైద్యురాలికి 13 నెలల్లో.. మూడుసార్లు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

