e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Huzurabad | ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎమ్మెల్యే పద్మదేవేందర్‌రెడ్డి

Huzurabad | ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎమ్మెల్యే పద్మదేవేందర్‌రెడ్డి

వీణవంక రూరల్ : గ్యాస్, పెట్రోల్‌, డిజీల్‌ ధరలను పెంచి సామాన్య ప్రజల మీద భారం వేస్తున్న బీజేపీ పార్టీకి ఓటుతో బుద్ది చెప్పాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.మండల పరిధిలోని బ్రహ్మణపల్లి, కొండపాక గ్రామల్లో ఇంటిటా ప్రచారం నిర్వహించారు. మహిళలలను, వృద్దులను అప్యాయంగా పలుకరిస్తు ప్రచారం చేపట్టారు.

కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం నోట్లు రద్దు చేసి ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతలో 15 లక్షలు వేస్తామని చేప్పి, డబ్బు వేయకుండా పేద ప్రజలను మోసం చేశారన్నారు. మోడీ గ్యాస్, పెట్రోల్‌, డీజిల్ ధర‌ల‌ను పెంచుతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, ఈటల రాజేందర్‌ ఎందుకు మాట్లాడడం లేదో ప్రజలకు చేప్పాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గ్యాస్ ధర 1500 వందలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 200 వందలు చేస్తారని ఆరోపించారు.

- Advertisement -

ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం టీఆర్‌ఎస్ అన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాలు అభివృద్ది చేందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఎదో ఒక ప్రభుత్వ పథకం అందుకుంటుందన్నారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్‌, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ దే అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పథ‌కాలను ఎందుకు తీసుకురాలేదో బీజేపీ నాయకులు సమాధనం చేప్పాలన్నారు.

ప్రజల మోసం చేసి ఎన్నికలలో గెలువాలని చూస్తున్న ఈటల రాజేందర్‌ కు ప్రజలు బుద్ది చేప్పాలన్నారు. ఎమ్మెల్యేగా. మంత్రిగా కేసీఆర్‌ అవకాశం ఇస్తే, ప్రజలకు సేవా చేయకుండా అస్తులను కాపాడుకోడానకి టీఆర్‌ఎస్ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరాడన్నారు. విద్యావంతుడు. ఉద్యమకారుడు, కేసీఆర్‌ అడుగుజాడలో నడిచిన గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement