– కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం
– మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచ, ఏప్రిల్ 21 : తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో కొత్తగూడెం నియోజకవర్గ – పాల్వంచ పట్టణ, మండల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రెండున్నరేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు.
అలాగే బూత్ స్థాయిలో బలమైన కమిటీల నిర్మాణమే రాబోయే విజయానికి పునాది అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరు సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అన్నారు. కేసీఆర్ గెలుపును ఏ శక్తి కూడా ఆపలేదన్నారు. రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ను చీదరించుకుంటున్నారన్నారు. కార్యకర్తలతో నాయకులంతా సమిష్టిగా ముందుకు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్, సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, కాంపెల్లి కనకేష్, పాల్వంచ మండల అధ్యక్షుడు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు బత్తుల మధుచంద్, సిందూ తపస్వి, గుగులోత్ రాంబాబు, గోవాడ గుణచరిత్, పాల్వంచ పట్టణ బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు బట్టు మంజుల, నాయకులు కే టి పి ఎస్ ఆర్కే, ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, మిరియాల అలివేలు, అల్లి సాయికిరణ్ పాల్గొన్నారు.