Mallikharjun Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మోడీని ‘టెర్రిరిస్ట్’తో పోల్చారు. ప్రధానిని ఉగ్రవాది అని పేర్కొనడంపై మీడియా వివరణ కోరగా ఆయన నాలుక్కరుచుకున్నారు. ‘అయ్యో.. నా ఉద్దేశం అది కాదు. నేను అసలు మోడీని టెర్రిరిస్ట్ అనలేద’ని ఖర్గే వివరణ ఇచ్చారు. బీజేపీతో ఏఐడీఎంకే పార్టీ పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ మోడీని టార్గెట్ చేశారు.
మంగళవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే ఏఐడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఒక టెర్రిరిస్ట్ అని పేర్కొన్న ఖర్గే.. అనంతరం మాట మార్చారు. ‘దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను ప్రధాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అందుకే మోడీని టెర్రిరిస్ట్ అని పేర్కొన్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. అన్నాదురై ఫొటోతో ఓట్లు అడిగే ఏఐడీఎంకే వాళ్లు మోడీతో చేతులు ఎలా కలిపారు? మోడీ ఒక టెర్రరిస్ట్. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను మోడీ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu | Congress President Mallikarjun Kharge says, “How these AIADMK people, who themselves put the photo of Annadurai, how can they join Modi? He is a terrorist. His party won’t believe in equality and justice. These people are joining with them; it means… pic.twitter.com/znLvE7hutP
— ANI (@ANI) April 21, 2026
డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రధాని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. అందుకే నేను ఆయనను టెర్రరిస్ట్ అని అన్నాను. ఆయన పార్టీకి న్యాయం, సమానత్వంపై నమ్మకం లేదు. అలాంటి పార్టీతో ఏఐడీఎంకే పొత్తు పెట్టుకుంది. అంటే.. వీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నారు. అన్నాదురై, కామరాజ్, పెరియార్, కలింగర్, బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారు అని ఖర్గే మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తమిళనాడులో కాంగ్రెస్ – డీఎంకే కూటమి సంక్షేమ పాలన అందించనుందని ఖర్గే వెల్లడించారు.
‘తమిళనాడులో కాంగ్రెస్ – డీఎంకే కూటమి సంక్షేమ పాలనను కొనసాగిస్తుంది. సమీకృత అభివృద్ధి, సమానాత్వం, విద్య, చౌకగా ఆరోగ్య సేవలు వంటివి అందిస్తాం’ అని ఖర్గే తెలిపారు. అయితే.. మోడీని ఖర్గే టెర్రిరిస్ట్ అనడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ అర్బన్ నక్సల్ పార్టీ అని, అందుకే ఖర్గే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ మీడియా ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని టెర్రరిస్ట్ అనడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అవమాన పరిచాయని మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
I feel ashamed that the Congress and the DMK have stooped so low that they are insulting the Prime Minister who is democratically elected by the people of India, by calling him a terrorist.
Rahul Gandhi and MK Stalin must apologise for this downright insult to the Prime… https://t.co/V1nS0H0PPj
— Piyush Goyal (@PiyushGoyal) April 21, 2026