నీలగిరి, నవంబర్ 23: జిల్లా జనరల్ దవాఖానలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నాలుగు రోజులుగా సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆదివారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతినెలా జీతాలు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు నెలలు దాటినా జీతాలురావడం లేదని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి దవాఖానలను బలోపేతంచేస్తే, రేవంత్‌రెడ్డి సర్కారు వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు..
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నా లుగు రోజులుగా కార్మికులు విధులు బహిషరించి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఏ-1 ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి కార్మికుల సమస్యలు పెరిగాయని ఆరోపించారు. పెండింగ్ జీతాలు, పీఎఫ్ చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.