రాష్ట్రాల వద్ద 89లక్షల డోసులు : ఆరోగ్య మంత్రిత్వశాఖ
రాష్ట్రాల వద్ద 89లక్షల డోసులు : ఆరోగ్య మంత్రిత్వశాఖ | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది.

న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. ఇప్పటి వరకు 17.15 కోట్లకుపైగా వ్యాక్సిన్లను ఉచితంగా అందజేసిందని, ఉదయం 8 గంటల వరకు అందించిన సమాచారం మేరకు వృథాతో సహా మొత్తం 16,26,10,905 మోతాదులు వినియోగించినట్లు చెప్పింది. 89,31,505 డోసులు ఇప్పటికీ యూటీలు, రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ‘నెగెటివ్ బ్యాలెన్స్ ఉన్న రాష్ట్రాలు సాయుధ దళాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్ను సర్దుబాటు చేయనందున సరఫరా చేసిన వ్యాక్సిన్ కంటే ఎక్కువ వినియోగాన్ని (వ్యర్థాలతో సహా) చూపుతున్నాయి’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాబోయే మూడు వారాల్లో 28,90,360 డోసులు సరఫరా చేయనున్నట్లు చెప్పింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రాష్ట్రాలు, యూటీల సహకారంతో ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ అనేది మహమ్మారి నియంత్రణ కేంద్రం ఐదు పాయింట్ల వ్యూహంలో అంతర్భాగమని పేర్కొంది. కొవిడ్ టీకా ‘లిబరలైజ్డ్ అండ్ యాక్సిలరేటెడ్ ఫేజ్-3 స్ట్రాటజీ’ అమలు మే 1 నుంచి ప్రారంభమైందని, లబ్ధిదారులు నేరుగా కొవిన్ పోర్టల్ (http://cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
అజిత్సింగ్ మృతిపై ప్రధాని సంతాపం
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
‘అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి’
కుక్క అరెస్ట్.. ఎక్కడ? ఎందుకంటే..?
భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

