వ్యాక్సినేషన్ @ వంద రోజులు.. 14.19 కోట్ల డోసుల పంపిణీ
వ్యాక్సినేషన్ @ వంద రోజులు | ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ భారత్‌లో కొనసాగుతుండగా.. టీకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం వంద రోజుకు చేరింది.

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ భారత్‌లో కొనసాగుతుండగా.. టీకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం వంద రోజుకు చేరింది. ఇప్పటి వరకు 14.19 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. 20,44,954 సెషన్లలో 14,19,11,223 వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో 92,98,092 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 60,08,236 మందికి రెండో డోసు వేశామని చెప్పింది. 1,19,87,192 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి మోతాదు, 63,10,273 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.

అలాగే 60 ఏళ్లు పైబడిన 4,98,72,209 మందికి ఫ్టస్ డోస్, మరో 79,23,295 మందికి రెండో డోస్ అందించినట్లు చెప్పింది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న వ్యక్తుల్లో 4,81,08,293 మంది లబ్ధిదారులకు మొదటి, 24,03,633 మందికి రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలో టీకాల పంపిణీ 58.7 శాతం ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 10 లక్షల మోతాదులను వేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
IPL 2021 : ఢిల్లీకి షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్
భారత్‌కు సహాయానికి పెంటగాన్‌కు ఆదేశాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

