ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. గతంలో బీడీ కార్మికులు, వితంతు, ఒంటరి మహిళలకు ఇచ్చే రూ.1000 పింఛన్‌ను రూ.2,016కు పెంచారు. కేసీఆర్ కిట్ కింద రూ.13 వేలు, అర్హులైన వారికి 20వేలకుపైగా తెల్లరేషన్‌కార్డులను మహిళల పేరిట అందించారు. ఆశ కార్యకర్తలకు రూ.3వేలు ఉన్న వేతనం రూ.9,775 చేరుకోగా.. అంగన్వాడీలకు రూ.6 వేల నుంచి రూ.13 వేల వరకు పెరిగింది. విద్యా పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా గురుకుల పాఠశాలలు, కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయడంతో 1000 మంది మహిళలకు కొత్త ఉద్యోగాలు లభించాయి. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద 1లక్ష 16వేల చొప్పున అందిస్తుండగా.. రైతుబీమా పథకం కింద మహిళలకే 5 లక్షల సాయం అధికంగా అందుతున్నది. దీనికితోడు స్వయం సహాయక సంఘాలు, ఏఎన్ఎంలు, మల్టీపర్పస్ వర్కర్లకు కూడా పెద్ద ఎత్తున నియమించడంతో మహిళలకు ప్రయోజ నం దక్కింది. రాజకీయ పరంగా స్థా నిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ క ల్పించడంతో మహిళా ప్రజాప్రతినిధు లే ప్రజలను పాలించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలపై మహిళ బంధు పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది.
తెలంగాణ సర్కారు మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయిన అనంతరం ఈ ఏడేండ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే నిదర్శనం. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా, ఏ రాష్ట్రంలో అమలు చేయని స్కీమ్స్ ప్రవేశపెట్టి సబ్బండ వర్గాల మెప్పు పొందుతున్నారు. అర్హులైన మహిళలకు రేషన్‌కార్డులు, ఆడబిడ్డలు పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రసవం పొందితే కేసీఆర్ కిట్, ఆశ కార్యకర్తలకు వేతన పెంపు, ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్ వంటి పథకాలు ప్రవేశపెట్టి వారి ఆత్మబంధువుగా మారారు. కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
– నిర్మల్ టౌన్, మార్చి 7
టవర్లు ఎక్కగలం.. విద్యుత్ పునరుద్ధరించగలం
నిర్మల్ టౌన్, మార్చి 7 : మగవారికే కష్టసాధ్యమైన ఉద్యోగాన్నే ఎంచుకున్నారు ఈ మహిళలు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ శాఖలో 8 మంది జూనియర్ లైన్వుమెన్లుగా ఎంపికయ్యారు. పెద్దపెద్ద విద్యుత్ టవర్లు, స్తంభాలను అలవోకగా ఎక్కి, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. విభిన్నమైన ఉద్యోగాన్ని ఎంచుకొని, మగవారికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకుంటున్న ఈ జూనియర్ లైన్వుమెన్స్పై ప్రత్యేక కథనం..
తండ్రి ప్రోత్సాహంతోనే..
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా అమ్మానాన్న రామకృష్ణ-ప్రవీణ. చిన్నప్పటి నుంచి మంచిగా చదివి ఉద్యోగం సాధించాలని మా నాన్న ప్రోత్సహించారు. ఎంబీఏ పూర్తిచేశాను. ఐటీఐ ఎలక్ట్రికల్ రెండేళ్లు చేసిన. 2017లో జూనియర్ లైన్‌మన్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్న. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాను. విద్యుత్ స్తంభాలు ఎక్కితేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పడంతో నెలరోజులు ప్రాక్టీస్ చేసిన, 2018లో సారంగాపూర్‌లో జాబ్ వచ్చింది.
– ఆకాంక్ష, జూనియర్ లైన్వుమెన్, సారంగాపూర్
పళ్లైన పద్నాలుగేళ్లకు..
నా పేరు దుర్గం రజిత. మా ఆయన రత్నరాజం. మాకు 2007లో పెళ్లి అయ్యింది. మాది బెల్లంపల్లి. 2015లో మంచిర్యాలలో ఐటీఐ చేసిన. మాకు ఇద్దరు పాపలు. మా ఆయన ప్రోత్సాహంతో 2017లో నెలరోజులపాటు కోచింగ్ తీసుకొని లైన్‌మన్ ఉద్యోగానికి పరీక్ష రాశాను. 2018లో ఉద్యోగానికి ఎంపియ్యాను. స్తంభాలు, టవర్లు ఎక్కితేనే ఉద్యోగం ఇస్తామని చెప్పిన్రు. ప్రాక్టీస్ చేసి స్తంభం ఎక్కిన. ఉద్యోగానికి ఎంపికై కుంటాల మండలంలోని బూరుగుపల్లిలో జూనియర్ లైన్వుమెన్గా సబ్‌స్టేషన్‌లో 2021లో ఉద్యోగంలో చేరిన. ఇలాంటి ఎత్తైన విద్యుత్ టవర్లనూ అవలీలగా ఎక్కి సరిచేస్తా.
ఆశాలకు ఆత్మగౌరవం దొరికింది..
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఆశ కార్యకర్తలను అక్కున చేరుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. ఆరోగ్య శాఖలో ఏ సర్వే నిర్వహించినా.. ఏ సంక్షేమ పథకం అమలు చేసినా ఆశాలకు ప్రాధాన్యతనిచ్చింది. అటువంటి ఆశాలకు కూడా వేతనాలను పెంచింది. ప్రారంభంలో 1500 వేతనం ఉన్న రూ.9,775కు పెంచింది. ఇటీవల స్మార్ట్ఫోన్లను కూడా అందించింది. ఆశాల్లో పని చేస్తున్న వర్కర్లలో మహిళలైనప్పటికీ గ్రామీణ ప్రజల్లో మేం చేస్తున్న సేవలకు గుర్తింపు, గౌరవం తెలంగాణ ప్రభుత్వమే పెంచింది.
– గంగామణి, ఆశ కార్యకర్త
పింఛన్ పెంచిన దేవుడు..
మాది కుభీర్ మండల కేంద్రం. 20 ఏళ్ల నుంచి బీడీలు చుడుతున్నా. గతంలో నెలలో 20 రోజులు పని దొరికేది. బీడీలు చుడితే కూలీ కింద రూ.2 వేల నుంచి రూ.2500 మాత్రమే వస్తున్నాయి. దీనికితోడు కేసీఆర్ సారు నెలకు పింఛన్ కింద రూ.2,016 ఇస్తున్నారు. మొత్తం రూ.4500 అవడంతో సాఫీగా బతుకుతున్నం.
– కొత్తూరు గజ్జవ్వ, బీడీ కార్మికురాలు, కుభీర్
కొత్త రేషన్‌కార్డు వచ్చింది..
మాది కుంటాల మండలంలోని ఓలా గ్రామం. నాకు ఎవరూ లేరు. పెళ్లయిన తర్వాత భర్త చనిపోవడంతో మా సొంత గ్రామంలోనే ఒంటరిగా ఉంటున్నా. నాకు తెల్లరేషన్కార్డుతోపాటు వితంతు పింఛన్ కావాలని దరఖాస్తు చేసుకున్నా. మొన్ననే తెల్లరేషన్‌కార్డు కొత్తది ఇవ్వడంతో ప్రతినెలా 5 కిలోల బియ్యం వస్తున్నాయి. బీడీలు చుట్టడం వల్ల బీడీల పింఛన్ కూడా రావడంతో ఎవరిపైనా ఆధాపడకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం.
– నాలం రజిత, ఓలా
చిట్టీలు వేస్తున్నా..
నాకు 65 ఏండ్లు ఉంటాయ. మా ఆయన చనిపోగానే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. కొత్త పింఛన్ మంజూరైంది. నెలకు రూ. 2,016 ఖాతాలో పడుతున్నాయి. ఇందులో నుంచి రూ.1000 ఖర్చులకు ఉంచుకొని మిగతా రూ.1,500లతో చిట్టీలు వేసుకుంటున్నా. ఆ చిట్టీ డబ్బులతో కొత్త అవసరాలను తీర్చుకుంటున్నా. వితంతు మహిళలకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం వల్లనే నాకు ప్రయోజనం ఉంటుంది.
– కే ముత్తుబాయి, ఓలా, కుంటాల మండలం
బిడ్డల లగ్గానికి డబ్బులు వచ్చినయ్..
మాది కుభీర్ మండల కేంద్రం. మాకు శిరీష, సునీత ఇద్దరు కూతుళ్లు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతం. మా పిల్లల పెళ్లిళ్లు గతేడాది రెండు ఒకేసారి చేసిన. కేసీఆర్ సార్ కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లోనే ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున ఇద్దరికి కలిసి రూ.2,00,232 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులను తెలంగాణ ప్రభుత్వం పెళ్లి చేసిన తల్లుల పేరు మీద ఇవ్వడం వల్ల వచ్చిన డబ్బులు దుర్వినియోగం కాకుండా అవసరాలకు ఉపయోగపడ్డాయి.
– శివాజీ జానాబాయి, కుభీర్ మండలం
జీతాలు పెంచారు..
అంగన్వాడీ కార్యకర్తగా 20ఏండ్ల నుంచి పని చేస్తున్నా. 2014 వరకు మా వేతనం రూ.5 వేలు మాత్రమే ఉండేది. కేసీఆర్ వచ్చాక మొదటగా రూ.10 వేలు, ఆ తర్వాత రూ. 13,500 పెంచారు. అంగన్వాడీ ఉద్యోగిగా పని చేస్తున్న తమ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవం పెంచే విధంగా వేతనాలు పెంచారు. ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా.
– శైలజ, అంగన్వాడీ కార్యకర్త, బంగల్పేట్, నిర్మల్
ఆకాశంలో సగం..
భైంసా, మార్చి 7 : కరోనా అంటే సొంత వాళ్లే ఆమడ దూరం పారిపోతున్న ఈ రోజుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివి. పాజిటివ్ రోగులకు సైతం వైద్య సేవలు అందిస్తూ తమ నిబద్ధతను చాటుకున్నారు. ప్రసవం కోసం వచ్చిన వారెవరికైనా, పాజిటివ్ అని తెలిసినా ధైర్యంగా పురుడు పోసి తలీబిడ్డల ప్రాణాలు నిలబెట్టారు భైంసా ఏరియా దవాఖాన వైద్యులు. పట్టణంతో పాటు 7 మండలాలకు చెందిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన రోగులకు సైతం దవాఖానలో చికిత్స అందించారు. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో గర్భిణులకు కరోనా సోకితే చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం లభించింది..
వైద్యశాఖలోకి రావడం వల్ల ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం లభించింది. కరోనా సమయంలో వైరస్ ప్రమాదకరమని తెలిసినా రోగులకు అండగా ఉంటూ విధులు నిర్వర్తించాం. కరోనా సోకిన గర్భిణులకు సైతం నార్మల్ డెలివరీ చేశాం. మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్రకు చెందిన పలువురు మహిళలు ఇక్కడికి వస్తే వారికి కూడా నార్మల్ డెలివరీ చేశాం. రోగుల ప్రాణాలు కాపాడడమే వైద్యుల కర్తవ్యంగా భావించి 24 గంటలు విధులు నిర్వర్తించాం.
– పద్మావతి, వైద్యురాలు, భైంసా ఏరియా దవాఖాన
ప్రైవేటు ఉద్యోగం చేద్దామనుకున్న..
నా పేరు కావేరి శ్రీలత. జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా. మా అమ్మానాన్న మల్లయ్య-పోసక్క. నేనే చిన్నదానిని. మంచిర్యాలలో ప్రైవేటు ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తూ ఐటీఐ రెండేళ్లు పూర్తిచేశాను. 2016లో ఐటీఐ పూర్తికాగానే 2017లో జూనియర్ లైన్‌మన్ పోస్టు పరీక్ష రాశాను. అర్హత సాధించాను. నెల రోజుల్లో విద్యుత్ స్తంబాలు ఎక్కడం నేర్చుకున్న. ఐటీఐ పాస్ కాగానే జైపూర్ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగం వస్తదన్న ఆశతో ఉన్నా. కానీ, ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది. సారంగాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. టవర్‌పైన ఏ లోపం వచ్చినా ఐదునిమిషాల్లోనే సమస్య పరిష్కరిస్తా.