జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల మండలం వీరాపురం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గోవా నుంచి కొల్లాపూర్ తాలుక పెంట్లవెల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.