Encounter : పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు (Maoist) మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ (Gangaloor PS) పరిధిలోగల మాంకెలీ గ్రామం (Mankeli village) సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు.
దాంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం నిలిచిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన పోలీసులకు ఒక నక్సలైట్ మృతదేహం లభ్యమైంది. మిగతా మావోయిస్టుల కోసం అక్కడ గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.