హుజూరాబాద్: బేటా శ్రీను.. తుమ్ హీ జీతో గే.. ఏ మేరీ దువా హై.. అంటూ ఓ ముస్లిం తల్లి దీవించింది. బిడ్డా శ్రీను మాకు నెలనెలా ఆసరైతున్న కేసీఆర్‌కే మా ఓటు.. నువ్వు సల్లంగుండు బిడ్డ అంటూ మరో అవ్వ దీవెనార్థులు పెట్టింది. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకూ చేరిన సంక్షేమం.టీఆర్ఎస్ అభ్యర్థిపై ఆశీర్వచనాల రూపంలో కురుస్తోంది. మా పెద్దకొడుకు కేసీఆర్ పంపిన నిన్ను తప్పకుండా గెలిపిస్తామంటూ వృద్ధులు మాట ఇస్తున్నారు. టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు.