ముప్కాల్, నవంబర్ 9 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ ఆదివారం బోల్తాపడింది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఇథనాల్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ట్యాంకర్ నుంచి ఇథనాల్ లీకై రోడ్డుపై పారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.