హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడియాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం వివాదాస్పదమవుతున్నది. మంత్రుల గ్రూపులతోపాటు ఏకంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ (సీఎంవో) వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పోస్టు లు పెట్టడం విస్మయానికి గురిచేస్తున్నది. దీంతో ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల తీరుపై ఆయా సంస్థల మీడియా ప్ర తినిధులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా రు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వింత పోకడలు పోతున్నదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని చెప్తున్నారు.
ఇటీవల రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో ‘సర్’పై నిర్వహించిన జూమ్ సమావేశం, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన అంశాలు షేర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. సమాచార పౌర సంబంధాల శాఖ వాట్సాప్ గ్రూపులో రాహుల్‌గాంధీ ఢిల్లీ లో చేసిన ధర్నాపై సీఎం చేసిన ట్వీట్‌ను మీడియా అండ్ కమ్యూనికేష న్స్ డైరెక్టర్ షేర్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా సీఎం పీఆర్వోలు, ప్రభుత్వంలో ఉన్నత పోస్టుల్లో ఉన్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.