నాణ్యమైన కరెంటు కోసం సబ్‌స్టేషన్ ముట్టడి
కరెంటు సమస్యలపై యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల రైతులు కన్నెర్ర చేశారు. 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సు ద్దాలలోని సబ్‌స్టేషన్ ఎదుట ఆలేరు-మోత్కూర్ రహదారిపై సుద్దాల, అనంతారం గ్రామాల రైతులు బైఠాయించారు.
- యాదాద్రి జిల్లా సుద్దాలలో రైతుల ఆందోళన
గుండాల, జూలై 23: కరెంటు సమస్యలపై యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల రైతులు కన్నెర్ర చేశారు. 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సు ద్దాలలోని సబ్‌స్టేషన్ ఎదుట ఆలేరు-మోత్కూర్ రహదారిపై సుద్దాల, అనంతారం గ్రామాల రైతులు బైఠాయించారు. అనంతరం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నాటు వేసే సమయంలో కేవలం 12 గంటల కరెంటు ఇవ్వడం వల్ల పొలాలు పారకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నాటు వేసిన వరి ఎండిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 గం టలే కరెంటు ఇస్తున్నారని మండిపడ్డారు. అన్నంపెట్టే రైతులకు రేవంత్‌రెడ్డి సున్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వకుండా, పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా రైతులను నా నా ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. రైతులు రోడ్డుపై భైఠాయించి ధర్నా చేసిన అనంతరం సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. మోత్కూర్ ఏడీ బాలు నాయక్, ఏఈ అంబాల నర్సింహులు గౌడ్, మోటకొండూర్ ఎస్సై అశోక్, గుండాల ఏఎస్సై ప్రకాశ్ వచ్చి రైతులకు సర్దిచెప్పారు. ఆందోళనలో సుద్దాల సర్పంచ్ గడ్డమీది మహోదయ్, అనంతారం సర్పంచ్ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

