Congress | అధికారిక గ్రూపుల్లో పార్టీ ప్రచారాలు.. కాంగ్రెస్ పాలనలో వింత పోకడ!
Congress | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్ర భుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడి యాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం వివాదాస్పదమవుతున్నది.
Congress | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడియాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ చేయడం వివాదాస్పదమవుతున్నది. మంత్రుల గ్రూపులతోపాటు ఏకంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ (సీఎంవో) వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ వ్యవహారాలకు సంబంధించిన పోస్టు లు పెట్టడం విస్మయానికి గురిచేస్తున్నది. దీంతో ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల తీరుపై ఆయా సంస్థల మీడియా ప్ర తినిధులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా రు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వింత పోకడలు పోతున్నదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని చెప్తున్నారు.
ఇటీవల రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో ‘సర్’పై నిర్వహించిన జూమ్ సమావేశం, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన అంశాలు షేర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. సమాచార పౌర సంబంధాల శాఖ వాట్సాప్ గ్రూపులో రాహుల్‌గాంధీ ఢిల్లీ లో చేసిన ధర్నాపై సీఎం చేసిన ట్వీట్‌ను మీడియా అండ్ కమ్యూనికేష న్స్ డైరెక్టర్ షేర్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా సీఎం పీఆర్వోలు, ప్రభుత్వంలో ఉన్నత పోస్టుల్లో ఉన్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

