శంషాబాద్ రూరల్, జూలై 23 : విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం ‘శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టేకప్ అవుతున్న విమానంలో బాంబు ఉంది. ఏక్షణమైనా అది పేలవచ్చు.’ అని ఓ గుర్తుతెలియని వ్యక్తినుంచి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారిక వెబ్‌సైట్‌కు మెయిల్ వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని పలు విమానాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో దుండగుడు కావాలనే ఈ మెయిల్ చేసినట్టు భావించి ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.