నెల్సన్(న్యూజిలాండ్) : న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 పోరు వర్షార్పణమైంది. సోమవారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అయితే తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో విండీస్ వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. మ్యాచ్ సాఫీగా సాగుతున్న సమయంలో వరుణుడి ప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది.
విరామం లేని వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో కివీస్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. తొలి మ్యాచ్ విండీస్ గెలువగా, రెండు, మూడు మ్యాచ్ల్లో కివీస్ విజయం సాధించింది. ఆఖరిదైన ఐదో మ్యాచ్ గురువారం జరుగనుంది.